ప్రతి క్షణం నీ ధ్యాసేల
నా కన్నుల్లో నీ రూపమేల
గాలి తాకిడికి నీ స్పర్శేల
నీడ లో సైతం నీ ఛాయేల
ప్రతీ కాంతి లో నీ మేరుపేల
ప్రకృతిలో నీ సౌందర్యమేల
నా అధరాలపై అనుక్షణం నీ పేరేల
నీ కొరకై దిగులేల
నీ పై ఇంత తపనేల
నీ ప్రేమకై తపస్సేల
నువ్వు లేని నా జీవితమేల
నీ పై నాకింత ప్రెమేల
సాక్ష్యం ఆ నింగి ఈ నేల
నీలో మౌనమేల
నీ హృదయం కరుగదేల
తొలిసారి ప్రేమలో పడ్డ ప్రతీ ప్రేమికుడు / ప్రేమికురాలు పడే తీయని వేదన ఇది అని నా అభిప్రాయం.
అవునో కాదో మీరే చెప్పండి.......{ సఫలమైనా విఫలమైనా తొలిప్రేమ జీవిత కాలం వెంటాడుతూనే
ఉంటుంది.. మరచిపోయాం అని అనుకున్నా / చెప్పినా అది అసత్యం }
Subscribe
Tuesday, November 24, 2009
నా కన్నుల్లో నీ రూపమేల...
Labels: Entertainment
0 comments:
Post a Comment